NDL: పెంచిన గ్యాస్ సిలిండర్ ధర తక్షణమే తగ్గించాలని సీపీఎం పార్టీ పట్టణ కార్యదర్శి ఏ.రణధీర్ డిమాండ్ చేశారు. ఆత్మకూరులో ఇవాళ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లతో నిరసన తెలిపారు. నేతలు మాట్లాడుతూ.. గల్ఫ్ దేశాలు చేస్తున్న యుద్ధ సాకుతో గ్యాస్ ధరలు పెంచడం, నిత్యావసర వస్తువుల ధరలు పెరగనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు పాల్గొన్నారు.