బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర మృతి చెందినట్లు వార్తలొస్తున్నాయి. ఆ వార్తలను ఆయన కూతురు ఈషా డియోల్ ఖండించింది. ఆ వార్తల్లో నిజం లేదని తెలిపింది. తమ తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన కోలుకుంటున్నారని స్పష్టం చేసింది. ఈ క్లిష్ట సమయంలో తమ కుటుంబం గోప్యతను గౌరవించాలని, ఇలాంటి వార్తలను వ్యాప్తి చేయొద్దని తెలిపింది.