WGL: తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ నియమితులయ్యారు. నియామకం అనంతరం సోమవారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఎర్రబెల్లి స్వర్ణకు అభినందనలు తెలియజేశారు. “ఆమె నాయకత్వంలో మహిళా కాంగ్రెస్ మరింత ప్రభావవంతం అవుతుందని నమ్ముతున్నాము” అని అన్నారు.