ATP: జలవనరుల శాఖ అధికారులతో ఎమ్మెల్యే పరిటాల సునీత సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పీఏబీఆర్ కుడికాలువ పరిధిలోని రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల చెరువులకు నీరు అందించే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. వేసవి దృష్ట్యా సాగు, తాగునీటి అవసరాల కోసం చెరువులను త్వరితగతిన నింపాలని అధికారులను ఆదేశించారు.