E.G: నిడదవోలులో దివ్యాంగులకు సహాయక వాహనాలను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక & సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సోమవారం అందజేశారు. తదేకం ఫౌండేషన్ వారి సహకారంతో ముగ్గురికి ట్రై సైకిల్స్, ఒకరికి ఎలక్ట్రికల్ స్కూటర్‌ను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.