AP: మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో విద్యాశాఖలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలో పర్యటిస్తున్న ఆయన.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాతల సహకారంలో 9 వేల ఉచిత సైకిళ్లను అందించామన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో పదో తరగతి ఉత్తీర్ణత శాతం పెరగాలని సూచించారు.