ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసు విచారణ వాయిదా పడింది. ప్రతివాదులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత సహా 23 మందికి నోటీసులు అందజేసింది. ఈడీ కేసు విచారణ వాయిదా వేయాలని ట్రయల్ కోర్టుకు సూచనలు చేసింది. తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా వేసింది. ఈ కేసులో ఫిబ్రవరి 27న కోర్టు కేజ్రీవాల్, సిసోడియా, కవిత సహా 23 మందిని నిర్ధోషులుగా ప్రకటించింది.