TG: తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మరోపక్క ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ తన అభ్యర్థిని నిలబెట్టలేదు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు ఉంది. అనంతరం వీరిద్దరి ఎన్నికను రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించనున్నారు.