NLG: మిర్యాలగూడ మండలం వెంకటాద్రి పాలెంలో నూతనంగా నిర్మించిన రేవంత్, సుమంత్ రైస్ ఇండస్ట్రీస్‌ను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ ప్రాంతం రైస్ ఇండస్ట్రీలో పేరు పొందిందని, రైస్ మిల్లుల ఏర్పాటు వల్ల వేలాది మందికి ఉపాధి కలుగుతుందని అన్నారు.