»Archery World Cup 2023 Stage 2 Jyothi Surekha And Others Win Two Gold At Shanghai
Archery World Cup 2023:లో మనోళ్లు అదుర్స్..ఈసారి రెండు స్వర్ణాలు
గత నెలలో అంటాల్యలో జరిగిన ప్రపంచ కప్ స్టేజ్ 1 స్వర్ణం గెలిచిన తర్వాత, జ్యోతి, ఓజాస్ జోడి కొత్తగా మరో బంగారు పతకం గెల్చుకున్నారు. టాప్-సీడ్ కొరియా జట్టును 156-155తో ఓడించి ఔరా అనిపించుకున్నారు. దీంతోపాటు యువ ఆర్చర్ ప్రథమేశ్ జవాల్కర్ మేటి ఆర్చర్‌కు షాకిస్తూ పసిడి గెల్చుకున్నాడు.
షాంఘైలో శనివారం జరిగిన అర్చరీ చాంపియన్ షిప్ లో మనోళ్లు అదరగొట్టారు. ఈసారి ఏకంగా రెండు స్వర్ణాలు గెల్చుకున్నారు. పంతొమ్మిదేళ్ల ప్రథమేష్ జావ్కర్ తన తొలి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. జవ్కర్ సెమీఫైనల్స్‌లో ఎస్టోనియాకు చెందిన రాబిన్ జాత్మాను 147-145తో ఓడించాడు. ప్రపంచ ఛాంపియన్ అయిన డచ్‌మన్ ష్లోసెర్‌ను చిత్తు చేశాడు. అతను ప్రపంచ కప్‌లో మొత్తం 12 వ్యక్తిగత స్వర్ణ పతకాలను గెల్చుకున్న వ్యక్తి కావడం విశేషం.
జావ్కర్తో పాటు వి.జ్యోతి సురేఖ, ఓజాస్ డియోటాలే వరుసగా మిక్స్డ్ విభాగంలో గోల్డ్ పతకం గెల్చుకున్నారు. దీంతోపాటు అవ్నీత్ కౌర్ మహిళల వ్యక్తిగత విభాగంలో కాంస్యాన్ని కైవసం చేసుకుంది. దీంతో దేశానికి మూడు పతకాలు వచ్చాయి.
దీనికి ముందు అభిషేక్ వర్మ 2021 పారిస్‌లో జరిగిన ప్రపంచ కప్ దశలో కాంపౌండ్ పురుషుల విభాగంలో వ్యక్తిగత బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.
మిక్స్డ్ టీమ్ సమ్మిట్‌లో ఆరో స్థానంలో నిలిచిన భారత జోడీ జ్యోతి సురేఖ-యువ డియోటాల్ 156-155తో అగ్రశ్రేణి కొరియా జోడీ ఓహ్ యోహ్యూన్-కిమ్ జోంగ్హోను చిత్తు చేసి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు.
రెండు జట్లు మొదటి మూడు ఎండ్లలో సమంగా నిలిచాయి. ఆఖరి ఎండ్‌లో భారత్ 39-38తో కొరియాపై విజయం సాధించింది. మ్యాచ్ చివరి షాట్లో జ్యోతి 10 పాయింట్స్ సాధించింది.