NLR: తిరుకనుపూరులో రేపటి నుంచి శుక్రవారం వరకు ముత్యాలమ్మ జాతర వైభవంగా జరగనుంది. బుధవారం పోలేరమ్మ నిలుపు, గురువారం గురునాథస్వామి ఉత్సవాలను ఆలయ నిర్వాహకులు నిర్వహించనున్నారు. భక్తుల కోసం 120 ప్రత్యేక బస్సులు, 24 గంటల వైద్య సేవలు, 1000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది.