»Reason Behind Rs 2 Thousand Note With Draw Target Is Those Who Do Not Pay Tax
Rs.2 Thousand Note:రూ.2 వేల నోటు విత్ డ్రా వెనక కారణం ఇదే.. టాక్స్ చెల్లించని వారే లక్ష్యం
రూ.2 వేల నోటు రీకాల్ వెనక ఐటీ కట్టని వారే లక్ష్యం అని బిజినెస్ ఆనలిస్టులు చెబుతున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి నోట్లు డిపాజిట్/ మార్పిడి చేయడంతో బయటపడతారని విశ్లేషిస్తున్నారు.
Reason Behind Rs.2 thousand Note With Draw.. Target Is Those Who Do Not Pay Tax
Rs.2 Thousand Note:రూ.2 వేల నోటును (Rs.2 thousand Note) వెనక్కి తీసుకుంటున్నామని నిన్న రిజర్వ్ బ్యాంక్ (Reserve bank) ప్రకటించింది. డిజిటల్ విధాన ప్రోత్సాహంలో (క్లీన్ నోట్ పాలసీ) భాగంగా ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై చాలా మందికి అపోహలు, అనుమానాలు నెలకొన్నాయి.
పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ.2 వేల నోటును ముద్రించిన సంగతి తెలిసిందే. 2016లో నోట్లను ముద్రించగా.. 2018-19లో ముద్రించడం నిలిపివేసిందట. అందుకే రూ.2 వేల నోటు విత్ డ్రాపై అప్పట్లో కథనాలు వచ్చాయి. తాజాగా ప్రకటన చేయడంతో ఆ సందేహాం నిజమైంది.
రూ.2 వేల నోట్లు 89 శాతం మార్చి 2017కు ముందు జారీ చేశారు. వాటి జీవిత కాలం ఐదేళ్లు అని పేర్కొన్నారు. 2018 మార్చి 31వ తేదీ నాటికి రూ.2 వేల నోట్ల గరిష్ట చలమణి రూ.6.73 కోట్లుగా ఉండేది. దేశంలో చలామణిలో ఉన్న నోట్ల మొత్తంలో వీటి శాతం 37.3 శాతంగా ఉండేది.
2013 మార్చి 31వ తేదీ వరకు 2 వేల నోట్ల చలామణి రూ.3.62 లక్షల కోట్లకు తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మొత్తం నోట్లలో ఈ విలువ 10.8 శాతం మాత్రమే కావడం విశేషం. ఈ మొత్తం ప్రజల నుంచి బ్యాంకింగ్ వ్యవస్థలోకి రావాలి.
రూ.2 వేల నోటు విత్ డ్రా వెనక కేంద్ర ప్రభుత్వం వ్యుహం రచించిందని విశ్లేషకులు అంటున్నారు. ఒక్కొక్కరికీ రూ.10 నోట్లు రూ.20 వేలు డిపాజిట్ చేసే అవకాశం ఉంది. కొందరి వద్ద పెద్ద మొత్తంలో ఉంటుంది. వారు బ్యాంక్‌కు వెళ్లాల్సిన సమయం ఎక్కువ సార్లు వస్తోంది. ఈ క్రమంలో పన్ను చెల్లించని వారు బయటపడుతారని విశ్లేషకుల మాట. ఇలా చేయడంతో చాలా మంది నుంచి ఐటీ కట్టించుకోవచ్చని చెబుతోంది.