KNR :హుజురాబాద్‌కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు దాతృత్వాన్ని చాటుకున్నారు. గురువారం మండలంలోని సిరిసపల్లి బీసీ కాలనీ ప్రైమరీ స్కూల్లో 17 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం స్టీల్ ప్లేట్లను అందించారు. ట్రస్టు నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్. మహేందర్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్లేట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు.