TPT: తిరుపతి శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయ స్థలంలో నిర్మించిన అమ్మవారి వేంచేపు మండపాన్ని ఆదివారం మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పార్కింగ్ షెడ్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.