Punjab:గెలిచి తీరాల్సిన మ్యాచ్లో పంజాబ్ అద్భుత విజయం సాధించింది. వరస వికెట్లు తీస్తూ.. ఢిల్లీని (delhi) ఒత్తిడిలోకి నెట్టారు. 6.1 ఓవర్లలో 69 పరుగులు చేసి వికెట్ నష్టపోని క్యాపిటల్స్.. ఆ తర్వాత ఒకరి వెంట ఒకరు పెవిలియన్ వైపు నడిచారు. 168 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక ఢిల్లీ టీమ్ చతికిలబడింది. 31 పరుగుల తేడాతో పంజాబ్ (punjab) జట్టుపై ఓటమిని చవిచూసింది.
ఢిల్లీ (delhi) కెప్టెన్ డేవిడ్ వార్నర్ అర్థసెంచరీతో చెలరేగిపోయాడు. మరో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 21 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఔట్ అయ్యాక.. అంతే సంగతులు. పంజాబ్ స్పిన్నర్లు హర్ ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్ విజృంభించడంతో క్యాపిటల్ బ్యాటర్స్ వరసగా పెవిలియన్కు క్యూ కట్టారు.
ఢిల్లీ (delhi) జట్టులో అమన్ ఖాన్ 16, ప్రవీణ్ దూబే 16, కుల్దీప్ యాదవ్ 10 పరుగులు చేయడంతో.. ఢిల్లీ ఓ మోస్తరు స్కోర్ చేసింది. లేదంటే 100 పరుగుల లోపే చాప చుట్టేసేది. పంజాబ్ బౌలర్ హర్ ప్రీత్ బ్రార్ 4 వికెట్లు తీసి.. ఢిల్లీ టీమ్ నడ్డి విరిచారు. నాథన్ ఎల్లిస్, చహర్ తలో 2 వికెట్లు తీశారు. ఢిల్లీ జట్టుపై విజయంతో పంజాబ్ ఆరో స్థానానికి చేరుకుంది. తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
పాయింట్ల పట్టికలో గుజరాత్ అగ్రస్థానంలో ఉంది. చెన్నై, ముంబై వరసగా రెండు, మూడు స్థానాల్లో ఉండగా.. లక్నో నాలుగో స్థానంలో ఉంది.