KRNL: గోనెగండ్ల మండల వైద్య అధికారి డాక్టర్ రంగా రవళి తన స్ఫూర్తిదాయక జీవన ప్రయాణాన్ని మీడియాతో పంచుకున్నారు. తల్లి కోరిక మేరకు వైద్య విద్యను అభ్యసించానని ఆమె పేర్కొన్నారు. భర్త, అత్తమామల ప్రోత్సాహంతో వైద్యాధికారిగా ప్రజాసేవ చేస్తున్నానని తెలిపారు. మహిళలు సంకల్పంతో ముందుకు సాగితే ఏదైనా సాధించగలరని వివరించారు.