»When Aishwarya Rai Revealed She Had Fights With Abhishek Bachchan Every Day
AishwaryaRai: భర్తతో రోజూ గొడవపడ్డానంటున్న ఐశ్వర్యా రాయ్..!
బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ లు ముందుంటారు. వీరి వివాహ బంధం ఇటీవల 16 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. పెళ్లై ఇంతకాలం అయినా వీరి బంధం ఎంతో అన్యోన్యంగా సాగుతోంది. వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, విడిపోతున్నారంటూ ఎఫ్పుడూ ఏదో పుకార్లు వస్తూనే ఉంటాయి.
బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ లు ముందుంటారు. వీరి వివాహ బంధం ఇటీవల 16 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. పెళ్లై ఇంతకాలం అయినా వీరి బంధం ఎంతో అన్యోన్యంగా సాగుతోంది. వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, విడిపోతున్నారంటూ ఎఫ్పుడూ ఏదో పుకార్లు వస్తూనే ఉంటాయి. కానీ వీరు మాత్రం తమ బంధాన్ని అందంగా కాపాడుకుంటూ వస్తున్నారు. కాగా, తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ వారి మధ్య సమస్య గురించి ఐశ్వర్యారాయ్ తొలిసారి స్పందించారు.
మీ మధ్య గొడవలు వస్తూ ఉంటాయా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. దానికి ఐశ్వర్య ఆసక్తికర సమాధానం ఇఛ్చారు. తాము ప్రతిరోజూ గొడవపడతామని చెప్పారు. అలాంటి గొడవలు ఉంటేనే సరదాగా ఉంటుందని, లేకపోతే బోర్ కొడుతుందని చెప్పడం విశేషం. ఇదే విషయమై అభిషేక్ మాట్లాడుతూ..సాధారణంగా గొడవ తర్వాత తానే చివరికి కొంత తగ్గి. భార్యకు సారీ చెప్పేవాడినని , దానివల్ల తమ మధ్య సమస్య సద్దుమణుగుతుందని చెప్పడం విశేషం.
అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్యరాయ్ కొంతకాలం మాత్రమే డేటింగ్ చేశారు. ఆ తర్వాత 2007లో ఐష్ కు అభిషేక్ ప్రపోజ్ చేశాడు. అదే సంవత్సరం ఏప్రిల్ 20న ఈ జంట ముంబైలో వివాహం చేసుకున్నారు. నవంబర్ 2011లో కుమార్తె జన్మించింది. ఆరాధ్య బచ్చన్ అని నామకరణం చేసారు. అభిషేక్ – ఐశ్వర్య వరుస చిత్రాల్లో కలిసి నటించారు. ధూమ్ 2 (2006)- గురు (2007) – రావణ్ (2010) చిత్రాలలో కలిసి నటించారు. కాగా, ఐశ్వర్యారాయ్ ఇటీవల పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించింది. ఇన్నేళ్ల తర్వాత కూడా ఆమె అందం కొంచెం కూడా చెక్కు చెదరకపోవడం చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఇంత అందం ఆమెకే సాధ్యమని కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో ఐశ్వర్య నందిని అనే పాత్రలో నటించారు.