T20 WC 2024 విజయం తర్వాత రోహిత్ నుంచి సారథ్య పగ్గాలు అందుకున్న సూర్య జట్టును అద్భుతంగా నడిపించాడు. అయితే T20 WCలో పెద్ద జట్లపై అతనికి చెప్పుకోదగ్గ స్కోర్స్ లేవనే విమర్శలున్నాయి. పైగా ఇవాళ్టి ఫైనల్ తర్వాత రిటైర్ అవుతాడనే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘సారథిగా బెస్ట్ ఇన్నింగ్స్ ఆడేందుకు సూర్యకు ఇదే బెస్ట్ ఛాన్స్, అదే అతని బాధ్యత’ అని సూచించాడు.