ELR: ఉంగుటూరు మండలం పెద్ద వెల్లమిల్లి గ్రామానికి చెందిన సీనియర్ వైసీపీ నాయకులు కంభంపాటి శ్రీనివాస్ రావుతో పాటు మరొక 30 మంది వైసీపీ నేతలు ఆదివారం జనసేనలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్య పత్సమట్ల ధర్మరాజు క్యాంపు కార్యాలయంలో పార్టీలో చేరిన వారందరికీ ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి సాదరంగా జనసేన పార్టీలోకి ఆహ్వానించారు.