W.G: మోగల్లు ఎన్టీఆర్ కాలనీలో శనివారం వైద్య బృందం పర్యటించింది. రొయ్యల చెరువు నీరు చేరడంతో కాలనీవాసులు అస్వస్థతకు గురవుతున్నారన్న సమాచారంతో వైద్యాధికారి గులాబ్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో శిబిరం నిర్వహించి చికిత్స అందించారు. అనంతరం కాలనీలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. ముందస్తు జాగ్రత్తగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.