AP: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో మహిళలకు ట్రెక్కింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ఈగల్ ఐజీ రవికృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈగల్ ఐజీ మాట్లాడుతూ.. గంజాయి అక్రమ రవాణాపై దృష్టి సారించామని వెల్లడించారు. గంజాయి రవాణా అరికట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.