నటి యామీ గౌతమ్ తన సినీ ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘అవార్డు వేడుకల్లో నామినేషన్లు వచ్చినా పెద్ద అవార్డులు గెలవలేకపోయాను. కానీ ప్రేక్షకుల ప్రేమే నాకు నిజమైన గుర్తింపు. ఒక దశలో అవకాశాలు లేక సినిమాలను వదిలేయాలని అనుకున్నాను. హిమాచల్ ప్రదేశ్కు వెళ్లి వ్యవసాయం చేయాలని కూడా ఆలోచించాను’ అంటూ చెప్పుకొచ్చింది.