SRCL: ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ వైద్యశాలలలో ఆదివారం బాలికలకు క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ వేయనున్నట్లు ఎల్లారెడ్డి పేట మండల వైద్యాధికారి సరియా అంజుం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 14 సంవత్సరాల లోపు బాలికలకు హెచ్ పీవీ హ్యూమన్ పంపిల్లొమా వైరస్‌కు వాక్సిన్ను వేయనున్నట్టు తెలిపారు.