AP: అమరావతిలో శ్రీ పొట్టి శ్రీరాములు స్మృతివనం నిర్మాణం జరుగుతోందని మంత్రి సవిత వెల్లడించారు. ఈనెల 16న అమరజీవి జయంతి వేడుకల సందర్భంగా ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్’ పేరుతో ఏర్పాటు చేస్తున్న 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరవుతారని చెప్పారు.