హన్మకొండ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 24 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఇందులో 16మంది మద్యం తాగి వాహనాలు నడపగా, ఎనిమిది మంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపినట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సీతారెడ్డి తెలిపారు. ఈ కేసులపై కోర్టు జరిమానాలు విధించినట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి వాహనం నడిపితే చర్యలు తప్పవన్నారు.