VKB: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో మంచి పేరు సాధించాలని కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఛాంబర్లో జిల్లా అధికారులతో కలిసి తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఎక్కడైతే మహిళలకు గౌరవం లభిస్తుందో అక్కడ అన్ని విధాలుగా సుభిక్షం కలుగుతుందన్నారు.