GDWL: జిల్లాలో 14 ఏళ్ల బాలికలకు నేటి నుంచి హెచ్పీవీ వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా. సంధ్య కిరణ్మయి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 7,103 మంది 14 ఏళ్ల బాలికలు ఉన్నట్లు గుర్తించారన్నారు. బాలికలందరూ ఈ వ్యాకిన్ పంపిణీ సద్వినియోగం చేసుకోవాలన్నారు.