Ambati Rayudu:ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) తాడేపల్లిలో గల సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. గత కొంతకాలంగా ఏపీ సీఎం జగన్పై (jagan) ప్రశంసలు కురిపిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన రాజకీయ రంగ ప్రవేశం ఖాయం అనే ప్రచారం జరుగుతుంది. అందుకు ఊతమిస్తూ.. ఈ రోజు సీఎం జగన్ (jagan) వద్దకు వచ్చారు.
అంబటి రాయుడు (Ambati Rayudu) స్వస్థలం గుంటూరు (guntur) జిల్లా.. అతను క్రికెటర్గా రాణించాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. ఏపీ రాజకీయాల్లోకి వస్తున్నానని హింట్ ఇచ్చాడు. సీఎం జగన్ను (jagan) పొగుడుతూ.. తాను వైసీపీలో (ycp) చేరతాననే ఇండైరెక్టుగా చెబుతున్నాడు.
వచ్చే ఏడాది ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ముందే రాయుడు (rayudu) యాక్టివ్ అవుతున్నాడు. ఇటీవల శ్రీకాకుళం (srikakulam) జిల్లాలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ విపక్షాలపై విమర్శలు కురిపించారు. ఆ వీడియోను (video) అంబటి రాయుడు (ambati rayudu) సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అంబటి రాయుడు (ambati rayudu) కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఏపీలో వీరి ఓట్లు 12 శాతం ఓట్లు ఉంటాయి. పార్టీ గెలుపు, ఓటములను కాపు ఓటర్లు ప్రభావితం చేస్తారు. పవన్ కల్యాణ్ (pawan kalyan) కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేత అనే సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ పోటీ ఉండనున్న నేపథ్యంలో.. సీఎం జగన్ (jagan) కాపు నేతలపై ఫోకస్ చేశారు. క్రికెటర్ అంబటి రాయుడును పార్టీలో చేర్చుకుంటే మంచిదని అనుకుని ఉంటారు. అందుకే ఆయనతో భేటీ అయ్యారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.