కడప: జిల్లాలో శనివారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 275 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. టూ వీలర్ నడిపే వారు హెల్మెట్, కారు ప్రయాణికులు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.