సత్యసాయి: పుట్టపర్తి వైసీపీ ఇంఛార్జ్ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గురువారం పూలకుంట్లపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా రచ్చబండ నిర్వహించి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు నష్టం జరుగుతుందని వివరించారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. అనంతరం గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.