గుంటూరు: నగరంలో కురుస్తున్న భారీ వర్షాల వలన ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని ఎమ్మెల్యే మాధవి అధికారులను ఆదేశించారు. కంకరగుంట, మూడు వంతెనల వద్ద నీరు నిల్వకుండా ఎప్పటికప్పుడు మోటార్లతో తోడాలని సూచించారు. ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. వర్షాల పట్ల ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.