కృష్ణా: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు సంబంధించి అవసరమైన నివేదికలను సిద్ధం చేసి సమర్పించాలని కలెక్టర్ డీ.కే. బాలాజీ అధికారులకు ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా నిర్వహించిన సమావేశంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం చంద్రబాబు త్వరలో నిర్వహించనున్న కలెక్టర్ల సమావేశం దృష్ట్యా వివిధ శాఖల పనితీరుపై చర్చించారు.