TPT: తిరుపతి రైల్వే స్టేషన్లో TTగా నటిస్తూ టికెట్ లేని ప్రయాణికులను మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. రైల్వే సిబ్బంది గేట్ నంబర్ 3 వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు వాగ్వాదం చేసుకోవడం గమనించారు. చెకింగ్ ఇన్స్పెక్టర్ అని చెప్పి రూ.1000 అడుగుతుండగా నకిలీ వ్యక్తిని వారు పట్టుకున్నారు.