టాలీవుడ్(Tollywood)లో ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు ఎక్కువగా సక్సెస్ సాధిస్తున్నాయి. అటువంటి కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమానే మరువ తరమా. ఈ మూవీలో అద్వైత్ ధనుంజయ హీరోగా నటిస్తున్నాడు. అతుల్యా చంద్ర, అవంతిక నల్వాలు హీరోయిన్లుగా చేస్తున్నారు. చైతన్య వర్మ (Chaitanya Varma) నడింపల్లి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
‘మరువ తరమా’ మూవీ సాంగ్ :
తాజాగా మరువ తరమా సినిమా(Maruva Taruma Movie) నుంచి ‘పాదం పరుగులు తీసే’ పాటను చిత్ర యూనిట్ రిలీజ్(Song Release) చేసింది. ప్రేమలో ఉన్న ఓ యువకుడి ఫీలింగ్స్ ను తెలిపేలా ఈ సాంగ్ ఉంది. ఈ పాటను పీవీఎన్ఎస్ రోహిత్ ఆలపించాడు. ఈ సినిమాకు విజయ్ బుల్గనిన్(Vijay Bulganin) మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ పాటలో హైదరాబాద్ చార్మినార్ వద్ద హీరో హీరోయిన్ లిప్ కిస్ సీన్ సీన్ పాటకు హైలెట్‌గా నిలిచింది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి అన్ని అప్ డేట్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ సాంగ్(Song Release) సినిమాపై భారీ అంచనాలను రేకెత్తించింది. ఈ సాంగ్ ను విడుదల చేసిన వెంటనే యూట్యూబ్ లో భారీ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే మరువ తరమా సినిమా తేదీని, మిగిలిన వివరాలను వెల్లడించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.