TPT: దొరవారిసత్రం మండలం వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి ఏకధాటిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. మండలంలోని నెల్లబల్లి, నేలపట్టు, ఏకొల్లు, వేణుంబాక గ్రామాలలో వర్షం పడుతోంది. వర్షం పడుతుండడంతో రోజువారి కూలీలు కాస్త ఇబ్బంది పడుతున్నారు. వరి పంట సాగుకు సరైన సమయంలో వర్షాలు పడుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.