TG: ఖమ్మంలోని వెలుగుమట్ల భూదాన్ బాధితులను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ పరామర్శించారు. KTR ఆదేశానుసారం పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధితులకు భోజనం, వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బాధితుల కోసం న్యాయస్థానంలో పోరాడేందుకు ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వెలుగుమట్లలోనే 100 గజాల స్థలం, రూ.5 లక్షలు ఇచ్చి పక్కా ఇళ్లు కట్టించాలని డిమాండ్ చేశారు.