HNK: యువత గెలుపు ఓటములను స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర ఆయిల్ఫేడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి ఖోఖో ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. యువత చదువుతోపాటు క్రీడలపై కూడా ఆసక్తిని కనబరచాలని, క్రీడలతో సైతం జీవితంలో ఉన్నత స్థితికి ఎదుగవచ్చని సూచించారు.