NTR: కొత్త ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద ప్రైవేట్ అంబులెన్స్‌ల ఇష్టారాజ్యం నడుస్తోంది. జిల్లా దాటి మృతదేహాలను తరలించేందుకు, రాజేశ్ అనే వ్యక్తికి చెందిన అంబులెన్సుల ఏజెంట్ నజీర్ చెప్పిందే రేటు. ఈ మేరకు మహాప్రస్థానం వాహనాలు కృష్ణా జిల్లా వరకే ఉండటంతో, గుంటూరుకు ₹4వేలు, ఏలూరుకు ₹5,500 చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.