KRNL: దీపావళి సందర్భంగా అనుమతులు లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా టపాసులు నిల్వ ఉంచినా, విక్రయించినా కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. టపాసుల విక్రయ ప్రాంతాల్లో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ, అక్రమ నిల్వలు గమనిస్తే 112 లేదా 100కు సమాచారం ఇవ్వాలని ఆయన తెలిపారు.