జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీసీ రిజర్వేషన్ల అమలును డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘బంద్ ఫర్ జస్టిస్’ విజయవంతంగా కొనసాగింది. ఆర్టీసీ డిపో ముందు బస్సులను అడ్డగించిన బీసీ నేతలు, బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ ఉద్యమం తరహాలో సామాజిక ఉద్యమంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు.