ATP: ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో గుంతకల్లు జంక్షన్ మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ తెలిపారు. ఈ నెల 18న సికింద్రాబాద్–తిరుపతి (07498), ధర్మవరం–షోలాపూర్ (01438) ప్రత్యేక రైళ్లు నడుస్తాయని పేర్కొన్నారు. గుంతకల్లు, తాడిపత్రి, గుత్తి స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తాయని వివరించారు.