TG: జగిత్యాల MLA సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై MP అర్వింద్ తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. కేంద్రీయ విద్యాలయానికి అడ్డుపడుతున్నానన్నది అసత్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను నిలబడతానో లేదో తెలియదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో తనకు సభ్యత్వం కూడా లేదని స్పష్టం చేశారు. పార్టీ టికెట్ ఇస్తే పోటీపై అప్పుడు ఆలోచిస్తానని వెల్లడించారు.