SRCL: ఇల్లంతకుంట మండలం కేశన్నపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పోతరాజు చంటి అధ్యక్షతన శనివారం గ్రామసభ నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సంఘాల సభ్యులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. కుటుంబంతో పాటు సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర గొప్పదని అన్నారు. ఉపసర్పంచ్ వజ్జపల్లి శ్రీకాంత్, గ్రామస్తులు పాల్గొన్నారు.