NRML: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు గుడిసె సంపూర్ణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా మార్చ్ 15 నుంచి అంగన్వాడీలకు ఒంటిపూట బడులు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.