తెలంగాణ(Telangana)లో వర్షాలు(Rain) దంచికొడుతున్నాయి. అకాల వర్షాల ముప్పు తెలంగాణకు ఇంకా పొంచి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Weather Department) తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని గంటల్లో భారీ గాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. మరో 3 గంటల పాటు అందరూ జాగ్రత్తగా ఉండాలని, కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
హైదరాబాద్(Hyderabad) నగరంలోని కూకట్పల్లి, చందానగర్, శేరిలింగంపల్లి, కేపీహెచ్బీ, గాగిల్లాపూర్, మదీనాగూడ, మల్లంపేట్, గండిమైసమ్మ, నిజాంపేట్, కొండాపూర్, మియాపూర్, హైదర్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లపై నీరు బాగా చేరిపోయింది. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు(Trafic problems) నెలకొన్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటం వల్ల మరో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Weather Department) తెలిపింది. అల్పపీడనం బంగాళాఖాతం వైపు కదులుతూ తుఫానుగా మారే అవకాశం ఉందని విపత్త నిర్వహణ శాఖ అధికారులు వెల్లడించారు. మరో 4 రోజుల పాటు తెలంగాణ(Telangana)లో భారీ వర్షాలు(Heavy Rains) ఉంటాయని, పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.