New Rules for Bikers: కొత్త బైక్ కొంటున్నారా..? తెలంగాణ ప్రభుత్వం కొత్త రూల్…!
మీలో ఎవరైనా కొత్తగా బైక్ కొనాలని అనుకుంటున్నారా..? అయితే ఈ విషయం కచ్చితంగా మీకోసమే. కొత్త గా బైక్ కొనాలి అనుకుంటున్నవారి కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త నియమం తీసుకువచ్చింది. అదేంటో తెలుసా? బైక్ తో పాటు రెండు హెల్మెట్ లుకొనడం. మీరు చదివింది నిజమే. ఇప్పటి వరకు కేవలం బండి నడిపేవారు మాత్రం హెల్మెట్ ధరిస్తే సరిపోతుంది అని చెప్పేవారు. కానీ, ఇక నుంచి బండి నడిపేవారు మాత్రమేకాదు, వెనక కూర్చున్న వారు సైతం హెల్మెట్ ధరించాల్సిందే.
రోడ్డు ప్రమాదాలను(Road Accidents) తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం అమలులోకి తీసుకువచ్చారు. మన రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.ఈ రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది నిత్యం ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రంలోని మెుత్తం ప్రమాదాల్లో ఎక్కువగా ద్విచక్రవాహనాలకు సబంధించినవేనని అధ్యయనాలు చెబుతున్నాయి. మెుత్తం ప్రమాదాల్లో 53 శాతం వాటా ద్విచక్రవాహనాల ద్వారా సంభవించే ప్రమాదాలే. అవి కూడా హెల్మెట్(Helmet) ధరించకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలిసింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో బైక్ కొనే ప్రతి వాహనదారుడు(Biker).. తప్పనిసరిగా రెండు హెల్మెట్లు(Helmets) కొనే నిబంధన అమలు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. కొనడమే కాదు, కచ్చితంగా ధరించాలి అనే రూల్ ని కూడా త్వరలోనే పూర్తిస్థాయిలో అమలులోనికి తీసుకురానున్నారు. గతేడాది తెలంగాణ(Telangana)లో మొత్తం 21,619 రోడ్డు ప్రమాదాలు(Road Accidents) జరగ్గా.. 7559 మంది మరణించారు. ఈ మొత్తం ప్రమాదాల్లో 10,653 బైక్ ప్రమాదాలు కాగా, 3,977 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఇందులో మూడొంతుల మరణాలకు కారణం.. తలకు బలమైన గాయం కావడమే అని పోలీసుల విచారణలో తేలింది. కాబట్టి రైడర్‌తో పాటు వెనుకాల కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరిస్తే చాలా వరకు మరణాలను తగ్గించొచ్చని పోలీసులు భావిస్తున్నారు.