ప్రస్తుతం చిరంజీవి 'భోళా శంకర్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగష్టు 11న భోళా శంకర్‌ను రిలీజ్ చేయబోతున్నారు. కీర్తి సురేష్, చిరు చెల్లెలిగా నటిస్తుండగా.. తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. తమిళ్ హిట్ మూవీ వేదాళం రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా తర్వాత మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు చిరు. కానీ ఇప్పుడు ఓ ప్రాజెక్ట్ సెట్ అయిపోయిందని.. అందులో ఇద్దరు యంగ్ హీరోలను ఆప్షన్స్‌గా పెట్టుకున్నారని తెలుస్తోంది. కానీ హీరోయిన్ మాత్రం ఫిక్స్ అయిపోయిందట.
మెగాస్టార్ కూతురు సుస్మిత బ్యానర్లో చిరు ఒక సినిమా చేయబోతున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తునే ఉన్నాయి. అయితే ఈ సినిమాకు ఇంకా డైరెక్టర్ ఎవరనేది ఫైనలైజ్ అవ్వలేదు. ఆ మధ్యలో కోలీవుడ్ డైరెక్టర్ పీఎస్ మిత్రన్ ఓకే అయ్యాడని టాక్ నడిచింది. కానీ ఫైనల్‌గా సోగ్గాడే చిన్ని నాయన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాలో.. చిరంజీవి(Megastar Chiranjeevi)తో పాటు మరో యంగ్ హీరోకు స్కోప్ ఉందట. ఈ పాత్ర కోసం టాలీవుడ్(Tollywood) యంగ్ హీరోల పేర్లు పరిశీలనలో ఉన్నాయట. రౌడీ హీరో విజయ్ దేవరకొండ(vijaydevarakonda), డీజె టిల్లు ఫేం సిద్ధు జొన్నలగడ్డ(Siddhu jonnalagadda) పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు చిరంజీవి(Chiranjeevi)తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ, సిద్ధు జొన్నలగడ్డ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇలాంటి సమయంలో మెగాస్టార్‌తో సినిమా చేస్తారా? అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. కానీ వాల్తేరు వీరయ్యలో రవితేజ క్యారెక్టర్లా బలమైన రోల్ ఉంటే మాత్రం.. ఖచ్చితంగా చిరుతో నటించే ఛాన్స్ మిస్ చేసుకోరు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాలో కుర్ర హీరోకి జోడిగా శ్రీలీల(Sree leela) కనిపించనుందట. ఇప్పటికే టాలీవుడ్లో పలు భారీ ప్రాజెక్ట్స్ చేస్తోంది శ్రీలీల. బాలయ్యకు కూతురిగా 108 ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. ఇక ఇప్పుడు మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ అంటున్నారు. అయితే మెగాస్టార్ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ చేయబోతోందనేది.. తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం.. శ్రీలీల ఏ ఒక్క హీరోని వదిలి పెట్టడం లేదనే చెప్పాలి. మరి ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఎప్పుడుంటుందో చూడాలి.