Jagan Biopic: జగన్ బయోపిక్ రేసులో ఇద్దరు హీరోలు!?
ఏపి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తునే ఉన్నాయి. కానీ దానికి సరైన సమయం రావాలి. ఇప్పుడా సమయం రానే వచ్చిందంటున్నారు. ప్రస్తుతం జగన్ బయోపిక్కు రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. అయితే జగన్‌గా ఎవరు నటించబోతున్నారనేది? ఇంట్రెస్టింగ్గా మారింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఇద్దరు హీరోలు రేసులో ఉన్నట్టు తెలుస్తోంది.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి(Ys Rajasekhar reddy) పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన ‘యాత్ర’ సినిమా(Yatra Movie) మంచి విజయాన్ని అందుకుంది. మహి వి. రాఘవ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో.. రాజశేఖర్ రెడ్డి పాద యాత్రలో చోటు చేసుకున్న కీలక సంఘటనలు, సంక్షేమ పథకాలను చూపించారు. రాజ శేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి(Mammootty) అద్భుత నటనను ప్రదర్శించారు. దాంతో ప్రస్తుతం యాత్ర2 తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అప్పట్లోనే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని తెలిపారు మేకర్స్. కానీ ఇప్పటి వరకు సీక్వెల్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా మహి వి. రాఘవ ‘సేవ్ ది టైగర్స్’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ మంచి పాజిటిద్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ‘యాత్ర-2’ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యాత్ర 2 ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. కాకపోతే ఎప్పుడు పట్టాలెక్కుతుందనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. కానీ అతి త్వరలోనే యాత్ర2(Yatra 2) ఉండే ఛాన్స్ ఉంది. గత ఎన్నికల సమయంలో యాత్ర మూవీ రాగా.. వచ్చే ఎలక్షన్స్ టార్గెట్‌గా యాత్ర 2 రానుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పాత్రలో ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. యాత్ర 2లో తమిళ నటుడు జీవా నటించనున్నారని సమాచారం. అయితే ఇంతకు ముందు జగన్(Jagan) పాత్ర కోసం.. స్కామ్ 1992 ఫేమ్ ప్రతీక్ గాంధీని తీసుకోబోతున్నట్టు వార్తలొచ్చాయి. దాంతో ఈ ఇద్దరిలో జగన్‌గా కనిపించేది ఎవరు? అనేది సస్పెన్స్‌గా మారింది. మరి కొద్దిరోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.