టీమిండియా- న్యూజిలాండ్ మధ్య రేపు ప్రపంచకప్ ఫైనల్ ఫైట్ జరగనుంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్లు డివిలియర్స్, స్టెయిన్ ఫైనల్ విజేతగా నిలిచేది ఎవరో వెల్లడించారు. భారత్ ఛాంపియన్గా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు. అయితే, కివీస్ విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. టీమిండియా ఏదైనా పెద్ద తప్పిదం చేస్తే తప్ప, NZ గెలిచే అవకాశం లేదని స్పష్టం చేశారు.