AP: శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, కెమికల్ కలిపారని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వైసీపీ హయాంలో తిరుమలలో క్వాలిటీ బెస్ట్ ల్యాబ్ ను తీసుకొచ్చామని చెప్పారు. ఆవు పాలే సేకరించని సంగం డెయిరీకి ఆవు నెయ్యి సరఫరా చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. సంగం డెయిరీ ఎవరిదో అందరికీ తెలుసన్నారు.